logo

న్యాయం చేయాలంటూ నిరసన హోరు

పాలకొండ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పట్టణానికి చెందిన యువకుడు శ్రవణ్‌ను నగర పంచాయతీ ట్యాంకరు  శనివారం రాత్రి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడని, దీనిపై న్యాయం చేయాలంటూ  బాధిత కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డెక్కారు.

Published : 30 Jan 2023 03:18 IST

రహదారిపై బైఠాయించిన బాధితులు, బంధువులు

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పట్టణానికి చెందిన యువకుడు శ్రవణ్‌ను నగర పంచాయతీ ట్యాంకరు  శనివారం రాత్రి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడని, దీనిపై న్యాయం చేయాలంటూ  బాధిత కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డెక్కారు. పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ప్రమాదానికి నీళ్ల ట్యాంకరు కారణమైనా అధికారులు స్పందించ లేదంటూ నిరసన తెలిపారు. బాధిత కుటుంబానికి అవుట్‌సోర్సింగులో ఉద్యోగంతో పాటు పరిహారం అందించాలని డిమాండు చేశారు. కమిషనర్‌ ఎస్‌.సర్వేశ్వరరావు సెలవులో ఉండడంతో అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తమకు న్యాయం జరిగేంత వరకు శ్రవణ్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయించేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబానికి మద్దతుగా బంధువులు, మిత్రులు తరలిరావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీఎత్తున పోలీసులు మోహరించారు. ఆతర్వాత డీఎస్పీ జీవీ కృష్ణారావు వచ్చి బాధితులతో మాట్లాడారు. నగరపంచాయతీ అధికారుల నుంచి వచ్చిన లేఖను చదివి వినిపించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని అందులో పేర్కొన్నందున ఆందోళన విరమించాలని నచ్చజెప్పారు. అనంతరం స్టేషన్‌ ప్రాంగణంలో చర్చలు జరిపారు. ఎట్టకేలకు శ్రవణ్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని