logo

భవనాలు పూర్తి.. సమస్యలకు స్వస్తి

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ భవనం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.06 కోట్లు మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం పనులకు శంకుస్థాపన చేశారు. కొవిడ్‌ తదితర కారణాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది.

Published : 30 Jan 2023 03:18 IST

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ భవనం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.06 కోట్లు మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం పనులకు శంకుస్థాపన చేశారు. కొవిడ్‌ తదితర కారణాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీనిపై ‘ఈనాడు’లో పలుమార్లు వెలువడిన కథనాలకు ఇంజినీరింద్‌ అధికారులు స్పందించారు. ఆరు నెలలుగా పనులు జోరుగా సాగడంతో నిర్మాణం పూర్తయింది. ఇది అందుబాటులోకి వస్తే గ్రహణమొర్రితో పాటు చిన్నారులకు సంబంధించిన వివిధ రుగ్మతులకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ విభాగానికి సంబంధించి వైద్యాధికారితో పాటు సిబ్బంది నియామకాలు జరిగాయి.


పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా ఆసుపత్రిలో పడకల సమస్యకు త్వరలో పరిష్కారం దొరకనుంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త భవనాల నిర్మాణాలు పూర్తవడంతో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు తర్వాత పార్వతీపురం ప్రాంతీయాసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చారు. పడకలను 100 నుంచి 150కి పెంచారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న స్థలంలో పడకలను సర్దుబాటు చేసి సేవలు అందిస్తున్నారు. కాలానుగుణ వ్యాధులు ప్రబలే సమయంలో ఒక్కో మంచంపై ముగ్గురు రోగులు ఉండే పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో చర్యలు చేపట్టారు.

త్వరలో ప్రారంభం..

బాలల సత్వర చికిత్స కేంద్రంతో పాటు బర్త్‌వెయిటింగ్‌ హాల్‌ను ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి 2020లో కేంద్రం రూ.30 లక్షలు మంజూరు చేసింది. అదే ఏడాది డిసెంబరులో పనులు ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం భవనం సిద్ధమైనా సాంకేతిక ఇబ్బందులు రావడంతో ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల అధికారులు వాటిని సరిచేశారు. దీంతోపాటు రూ.21 కోట్ల నాబార్డు నిధులతో ప్రత్యేక ప్రసూతి విభాగం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అది పూర్తి అయ్యేందుకు కొంత సమయం పట్టనుంది. ఈ మూడు భవనాలు అందుబాటులోకి వస్తే ఆసుపత్రిలో వసతి సమస్య తీరనుందని సూపరింటెండెంటు వాగ్దేవి తెలిపారు. బాలల సత్వర చికిత్స కేంద్రం, బర్త్‌ వెయిటింగ్‌ హాల్‌ను త్వరలో ప్రారంభిస్తామని ఏపీఎంఐఎస్‌డీసీ ఈఈ సత్యప్రభాకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని