logo

వనంగుడిలో యువకుడి హల్‌చల్‌

నగరంలోని పైడితల్లి వనంగుడిలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు.

Updated : 31 Jan 2023 05:45 IST

గాయాలు చూపిస్తున్న ధనరాజ్‌

నేరవార్తావిభాగం, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: నగరంలోని పైడితల్లి వనంగుడిలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. ఒకటో పట్టణ సీఐ వెంకటరావు వివరాల మేరకు.. ఆలయ ప్రవేశ ద్వారం వద్దగల పిట్టగోడ దూకి ఓ యువకుడు లోపలికి ప్రవేశించాడు. అప్రమత్తమైన కాపలాదారుడు ధనరాజ్‌ కేకలు వేయడంతో ఆయన తలపై, చేతి మీద కర్రతో కొట్టాడు. వెంటనే మరో కాపలాదారుడు అప్రమత్తమై యువకుడ్ని పట్టుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని, ఆలయ అధికారులు, ఉద్యోగుల నుంచి ఫిర్యాదు అందకపోవడంతో విడిచిపెట్టామని సీఐ తెలిపారు. గాయపడిన వ్యక్తిని సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని