logo

సేవలు మరో 2 నెలలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల సేవలను పొడిగించడంతో ఇబ్బందులు తప్పనున్నాయి.

Published : 01 Feb 2023 03:05 IST

విజయనగరం విద్యావిభాగం,   పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల సేవలను పొడిగించడంతో ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇచ్చిన పది నెలల గడువు జనవరి 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంకో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 259 మందికి లబ్ధి చేకూరనుంది.

సగానికిపైగా వీరే..

రెండు జిల్లాల్లో 32 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 13,341 మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు అన్నిచోట్లా ఒప్పంద అధ్యాపకులే ఎక్కువ. కొత్తగా మంజూరైన విజయనగరం, మెరకముడిదాం, దత్తిరాజేరు, రాజాం కళాశాలలకు పోస్టులు నేటికీ మంజూరు చేయకపోవడంతో వీరిని డిప్యుటేషన్‌పై వారంలో మూడురోజుల పాటు కొనసాగిస్తున్నారు. 446 మంది అధ్యాపకుల్లో 259 మంది వీరే ఉన్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి ఏప్రిల్‌ నుంచి 2023 జనవరి 30 తేదీ వరకు పనిచేయాల్సి ఉంది. గతంలో 12 నెలల పాటు సేవలందించగా, ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదినెలలకే అవకాశం కల్పించారు. సోమవారం నుంచి ప్రీ-పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి నాలుగోతేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 26 నుంచి ప్రయోగపరీక్షలు, మార్చి 15 వార్షిక పరీక్షలకు షెడ్యూల్‌ వచ్చేసింది. పరీక్షల దృష్ట్యా సేవలు పొడిగించడంతో మార్చి వరకు కొనసాగనున్నారని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల వృత్తివిద్యాశాఖాధికారులు సురేష్‌కుమార్‌, మంజుల వీణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు