logo

1,896 పింఛన్ల రద్దు

ఉమ్మడి జిల్లాలో పలువురు పింఛనుదారులకు అధికారులు షాకిచ్చారు. గతంలో లబ్ధి పొందిన వారిలో ఏకంగా 1,896 మంది పింఛన్లను రద్దు చేశారు. వీరు ఈనెలలో లబ్ధి పొందలేదు.

Published : 01 Feb 2023 03:05 IST

రాకోడులో వివరాలు సేకరిస్తున్న సంక్షేమ సహాయ కార్యదర్శి

విజయనగరం మయూరికూడలి, బెలగాం, రాజాం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో పలువురు పింఛనుదారులకు అధికారులు షాకిచ్చారు. గతంలో లబ్ధి పొందిన వారిలో ఏకంగా 1,896 మంది పింఛన్లను రద్దు చేశారు. వీరు ఈనెలలో లబ్ధి పొందలేదు. వచ్చేనెల నాటికి సరైన అర్హత పత్రాలు చూపిస్తే.పరిశీలించి, ఎంపిక చేయనున్నారు. మిగిలినవారికి యథావిధిగా బుధవారం నగదును అందించనున్నారు.

నోటీసులిచ్చి..

ఉమ్మడి జిల్లాలో రెండు నెలల కిందటి వరకు 4,09,011 మంది లబ్ధిపొందేవారు. ఆరు దశల పరిశీలనలో భాగంగా వీరిలో విజయనగరంలో 4,829, పార్వతీపురం మన్యంలో 2,450 మందికి నోటీసులిచ్చారు. అధికంగా భూమి ఉండడం, విద్యుత్తు బిల్లు ఎక్కువగా రావడం, నాలుగు చక్రాల వాహనం, ఆదాయపు పన్ను చెల్లింపు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగం చేయడం తదితర అంశాలను పరిశీలించి, ఆమేరకు 21 రోజుల్లో వాటికి సమాధానం ఇవ్వాలని సూచించారు. నిజంగా అర్హులైతే అసలు ధ్రువపత్రాలను సచివాలయాల ద్వారా అందించాలి. అయితే చాలామంది ముందుకు రాలేదని, దీంతో కొందరిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై డీఆర్‌డీఏ విజయనగరం పీడీ కల్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నామని, ఇంకా ఎవరైనా అర్హులుంటే పత్రాలతో రావాలని కోరారు. విజయనగరం జిల్లాలో ఈనెలలో 2,80,912 మందికి రూ.76.12 కోట్లు అందజేయనున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని