logo

శరణు..శరణు...పోలమాంబ

అదే జనం.. అదే భక్తి పరవశం.. తొలి జాతరను మరిపించేలా జనాలతో శంబర పోటెత్తింది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మారుజాతర దర్శనానికి భక్తులు తరలివచ్చారు.

Published : 01 Feb 2023 03:05 IST

భక్తజనంతో పోటెత్తిన శంబర

ప్రత్యేక అలంకరణలో చదురుగుడిలో అమ్మవారు

మక్కువ, న్యూస్‌టుడే: అదే జనం.. అదే భక్తి పరవశం.. తొలి జాతరను మరిపించేలా జనాలతో శంబర పోటెత్తింది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మారుజాతర దర్శనానికి భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఉదయం నుంచి వనంగుడి, చదురుగుడి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వనంగుడి వేపచెట్టుకు, నడిమివీధిలోని సిరిమానుకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకే వనంగుడి, చదురుగుడి ఆలయాల వద్ద క్యూలైన్లు నిండిపోయాయి. డీఎస్పీ సుభాష్‌ ఆధ్వర్యంలో సుమారు 150మందితో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీవో దేవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, ఈవో రాధాకృష్ణ ఆధ్వర్యంలో దేవదాయశాఖ సిబ్బంది సేవలు అందించారు.

భక్తులతో రద్దీగా నడిమివీధి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని