logo

తవ్వేసి.. ప్రమాదాన్ని ముందుంచి

నెల్లిమర్ల సమీపంలోని రైల్వే వంతెనల కింద భాగాలు కునారిల్లుతున్నాయి. ఐదేళ్ల కిందట సంబంధిత శాఖ ఆధ్వర్యంలో చంపావతి నదిలో రాతిపేర్పు(రివిట్‌మెంట్‌), రక్షణగోడలను నిర్మించారు.

Published : 01 Feb 2023 03:05 IST

మొదటి వంతెన వద్ద రాళ్లు తేలిన నిర్మాణం

న్యూస్‌టుడే, నెల్లిమర్ల: నెల్లిమర్ల సమీపంలోని రైల్వే వంతెనల కింద భాగాలు కునారిల్లుతున్నాయి. ఐదేళ్ల కిందట సంబంధిత శాఖ ఆధ్వర్యంలో చంపావతి నదిలో రాతిపేర్పు(రివిట్‌మెంట్‌), రక్షణగోడలను నిర్మించారు. ఏటా వస్తున్న వరదలకు దెబ్బతిని ఇలా శిథిలస్థితికి చేరుకున్నాయి. స్థానికంగా పెద్దఎత్తున సాగుతున్న ఇసుక తవ్వకాలే దీనికి కారణమని ఇక్కడి వారు చెబుతున్నారు. ప్రవాహ వేగం పెరుగుతుండడంతో నిర్మాణాలు కొట్టుకుపోతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైల్వేశాఖ అధికారులు స్పందించి ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

శిథిలస్థితిలో రెండో వారధి పిల్లర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని