logo

దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

మంగళపాలెం శ్రీగురుదేవ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కాకినాడ సీ పోర్ట్స్‌ సీఎస్‌ఆర్‌ (సామాజిక బాధ్యత) కింద సమకూర్చిన సుమారు రూ.25 లక్షల ఆర్థిక సహాయంతో 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు శనివారం అందజేశారు.

Published : 05 Feb 2023 04:26 IST

కృత్రిమ చేయి పొందిన లబ్ధిదారునితో కరచాలనం చేస్తున్న కాకినాడ సీ పోర్ట్స్‌ సీవోవో మురళీధర్‌

కొత్తవలస, న్యూస్‌టుడే: మంగళపాలెం శ్రీగురుదేవ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కాకినాడ సీ పోర్ట్స్‌ సీఎస్‌ఆర్‌ (సామాజిక బాధ్యత) కింద సమకూర్చిన సుమారు రూ.25 లక్షల ఆర్థిక సహాయంతో 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు శనివారం అందజేశారు. ట్రస్ట్‌ ఛైర్మన్‌ రాపర్తి జగదీశ్‌కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీ పోర్ట్స్‌ సీవోవో మురళీధర్‌ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు వాటిని అందజేశారు. వినికిడి యంత్రాలు, చక్రాల కుర్చీలు, బ్లెయిండ్‌ స్టిక్స్‌ వంటివి ఉన్నాయి. గత పాతికేళ్లలో 1.78 లక్షల మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాలను దాతల సహకారంతో అందించామని ట్రస్ట్‌ ఛైర్మన్‌ ప్రకటించారు. వైస్‌ ఛైర్మన్‌ డా.ఫణీంద్ర, రమణమూర్తి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని