logo

లోయలోకి ట్రాలీ : చోదకుడి మృతి

ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లోని ఘాట్రోడ్డులో ట్రాలీ బోల్తా పడిన ఘటనలో చోదకుడు మృతి చెందారు. దీనికి సంబంధించి పాచిపెంట ఎస్‌ఐ రమణ తెలిపిన వివరాల మేరకు.. అరకు నుంచి క్రేన్‌ సంబంధిత సామగ్రితో వస్తున్న ట్రాలీ ఒడిశా రాష్ట్రంలోని నందాపూర్‌ వద్ద మరమ్మతులకు గురైంది. విశాఖకు చెందిన మెకానిక్‌ సూర్యప్రకాశ్‌ను పిలిపించి మరమ్మతులు చేయించారు

Published : 05 Feb 2023 04:26 IST

పాచిపెంట, న్యూస్‌టుడే: ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లోని ఘాట్రోడ్డులో ట్రాలీ బోల్తా పడిన ఘటనలో చోదకుడు మృతి చెందారు. దీనికి సంబంధించి పాచిపెంట ఎస్‌ఐ రమణ తెలిపిన వివరాల మేరకు.. అరకు నుంచి క్రేన్‌ సంబంధిత సామగ్రితో వస్తున్న ట్రాలీ ఒడిశా రాష్ట్రంలోని నందాపూర్‌ వద్ద మరమ్మతులకు గురైంది. విశాఖకు చెందిన మెకానిక్‌ సూర్యప్రకాశ్‌ను పిలిపించి మరమ్మతులు చేయించారు. అనంతరం సాలూరు వైపు బయలుదేరిన ట్రాలీ ఘాట్‌రోడ్డులో అదుపు తప్పడంతో లోయలో పడింది. ప్రమాదంలో ఒడిశాలోని బొచ్చం బంకా బ్లాక్‌కు చెందిన చోదకుడు అభయకుమార్‌ సాహు (45) అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ఉన్న మెకానిక్‌ సూర్యప్రకాశ్‌కు తీవ్రగాయాలు కావడంతో సాలూరు ప్రాంతీయాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని