logo

లబ్ధిదారులకు సకాలంలో రుణాలు

ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు మంజూరు చేస్తామని జిల్లా లీడ్‌ బ్యాంకు ప్రబంధకుడు జె.ఎల్‌.ఎన్‌.మూర్తి చెప్పారు.

Published : 05 Feb 2023 04:36 IST

మాట్లాడుతున్న ఎల్‌డీఎం మూర్తి, వేదికపై పీడీ కిరణ్‌కుమార్‌, తిరుపతయ్య, సత్యంనాయుడు

పార్వతీపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు మంజూరు చేస్తామని జిల్లా లీడ్‌ బ్యాంకు ప్రబంధకుడు జె.ఎల్‌.ఎన్‌.మూర్తి చెప్పారు. శనివారం పార్వతీపురంలో పీఎం మత్స్య సంపద పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు సంబంధించి ముందుగానే బ్యాంకులతో ఒప్పందాలు జరుగుతాయన్నారు. లబ్ధి పొందే వ్యాపారులు మూడేళ్ల పాటు సక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తే రాయితీ మొత్తం పొందే అవకాశం ఉంటుందన్నారు. చేపల వ్యాపారం చేసేందుకు జిల్లాలోని 66 ఆర్బీకేల ద్వారా రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.30 లక్షల విలువైన అవుట్లెట్లను బ్యాంకు రుణాలతో ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి తిరుపతయ్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 60 శాతం, మిగిలిన వారికి 40 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్‌, ఏపీడీ సత్యంనాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని