logo

స్థానిక సంస్థల ఖాళీల భర్తీకి ఎన్నికలు

చీపురుపల్లి గ్రామీణం, పార్వతీపురం, న్యూస్‌టుడే: ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Published : 06 Feb 2023 04:29 IST

జిల్లాలో రెండు సర్పంచి, 25 వార్డుల్లో అవకాశం

మార్చి 2న ఓటరు జాబితా ప్రకటన

చీపురుపల్లి గ్రామీణం, పార్వతీపురం, న్యూస్‌టుడే: ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనరు నీలంసహాని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలు భర్తీ కానున్నాయి. కురుపాం మండలంలోని గుమ్మ, పాలకొండ మండలంలోని పనుకువలస సర్పంచి స్థానాలతో పాటు వివిధ పంచాయతీల్లోని 25 వార్డులను ప్రస్తావిస్తూ ఓటరు జాబితా రూపొందించాలని పంచాయతీ అధికారులకు, కలెక్టర్లకు ఉత్తర్వులు వచ్చాయి. జనవరి 5న ప్రకటించిన ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని మార్చి 2లోపు కొత్త జాబితాను ప్రకటించాల్సి ఉంటుందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. విజయనగరం జిల్లాలో విజయనగరం మండలంలోని పడాలపేట, గజపతినగరం మండలం లోగిశ, గంట్యాడ మండలం పి.ఎస్‌.ఆర్‌పురం, వంగర మండలం ఓనిఅగ్రహారం, లక్ష్మీపేట, పూసపాటిరేగ మండలం కొప్పర్లలో సర్పంచి ఎన్నికలతో పాటు 49 పంచాయతీల్లోని 53 వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

మండలాల వారీగా వార్డుల వివరాలు..

పార్వతీపురం మన్యంలో..: సాలూరు: పెదపదం-9, జిల్లేడువలస-2, జీగిరాం-4, పురోహితునివలస-2, పాచిపెంట: మెళియాకంచూరు-6, మాతుమూరు-5, పణుకువలస-7,  సీతానగరం: జోగింపేట-1, 7, లచ్చయ్యపేట-6, సీతంపేట: కీసరజోడు-4, కొత్తగూడ-6, కడదండి-8, పూతికవలస-3, దుగ్గి-1, చినబగ్గ-7, పాలకొండ: వి.పి.రాజుపేట-1, 7, పనుకువలస-7, సర్పంచి, అన్నవరం-6, వీరఘట్టం: నీలానగరం-4, గరుగుబిల్లి: పెదగుడబ-7, కొమరాడ: పరుశురాంపురం-5, గుమడ-10, జియ్యమ్మవలస: కొండచిలకాం-4, కురుపాం: గుమ్మ-సర్పంచి.

విజయనగరం జిల్లాలో..: రేగిడి ఆమదాలవలస: అడవరం-8, కండ్యాం-3, 5, పారంపేట-4, అంబకండి-4, రాజాం: పొగిరి-2, కంచరాం-8, సంతకవిటి: కె.రామచంద్రాపురం-4, బొండపల్లి: దేవుపల్లి-13, మరువాడ-2, కొండకిండాం-5, ఓంపల్లి-2, దత్తిరాజేరు: మరడాం-7, పెదమానాపురం-11, చీపురుపల్లి: అలజంగి-8, ఇటకర్లపల్లి-10, గుర్ల: దేవునికణపాక-8, గొలగాం-8, వల్లాపురం-8, జామి: తాండ్రంగి-7, లొట్లపల్లి-10, ఎస్‌కోట: కిల్తంపాలెం-9, వేపాడ: కె.ఆర్‌.పేట-3, సింగరాయి-4, 7, జగ్గయ్యపేట-4, బొద్దాం-3, కొత్తవలస: కంటాకాపల్లి-2, తుమ్మికాపల్లి-3, విజయనగరం: కొండకరకాం-9, తెర్లాం: పనుకువలస-3, 5, సుందరాడ-8, లింగాపురం-8, బొబ్బిలి: కారాడ-1, 2, శివడవలస-1, కొండదేవుపల్లి-2, మెంటాడ: చింతలవలస-5, గుర్ల-5, బాడంగి: పాలతేరు-6, గజపతినగరం: జిన్నాం-5, సాలిపేట-1, రామభద్రపురం: రొంపిల్లి-7, గంట్యాడ: జగ్గాపురం-2, వంగర: ఇరువాడ-7, రుషింగి-2, కొట్టిశ-8, కొప్పవలస-4,
గరివిడి: గెడ్డపువలస-8, నెల్లిమర్ల: గుషిణి-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు