logo

ఆ ఆరు కలిస్తే పెద్ద ప్రమాదమే

కోసలి, కీసర, ఘనసర, తాలాడ, బాలేరు, పసుకిడి, భామిని గ్రామాల్లో నాలుగు ఏనుగుల గుంపు సర్వం నాశనం చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Published : 06 Feb 2023 04:29 IST

భామిని సమీపంలో  ఏనుగులు

భామిని, న్యూస్‌టుడే: కోసలి, కీసర, ఘనసర, తాలాడ, బాలేరు, పసుకిడి, భామిని గ్రామాల్లో నాలుగు ఏనుగుల గుంపు సర్వం నాశనం చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వంశధార ఒడ్డున ఒడిశాలోని వన్న, గౌరీ సరిహద్దు ప్రాంతాల్లో మరో ఆరు పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. వీటితో పాటు ఆ నాలుగు కలిస్తే జరిగే నష్టాన్ని అంచనా వేయలేమని రైతులు భయపడుతున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ఏనుగులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ సెక్షన్‌ అధికారి హరికృష్ణ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా ప్రస్తుతానికి ఒడిశాలో ఉన్న ఆరు ఏనుగుల్ని ట్రాకర్లు గమనిస్తున్నారని, ఇక్కడి నాలుగింటిపై సమీపంలోని ట్రాకర్లు దృష్టి సారించారన్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు