logo

పులి దాడిలో ఆవు మృతి

మండలంలోని దిగువకొండపర్తి పంచాయతీ పరిధిలోగల రాంపాలెం వద్ద పులి పంజాకు ఓ ఆవు బలైంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆ ప్రాంత గిరిజనుల్లో గుబులు రేగింది.

Published : 06 Feb 2023 04:29 IST

అటవీశాఖాధికారులు గుర్తించిన బెబ్బులి పాదముద్ర

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని దిగువకొండపర్తి పంచాయతీ పరిధిలోగల రాంపాలెం వద్ద పులి పంజాకు ఓ ఆవు బలైంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆ ప్రాంత గిరిజనుల్లో గుబులు రేగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి జలాయానికి ఆవల ఉన్న రాంపాలేనికి చెందిన పైకరి నాగరాజు పశువులశాలపై బెబ్బులి దాడిచేసి ఆవును చంపేసింది. ఆదివారం ఉదయం ఆవు కళేబరాన్ని గమనించిన రైతు, గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా అటవీ అధికారులు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అక్కడ పాదముద్రలను గుర్తించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని