logo

నేటి నుంచి ఫార్మేటివ్‌- 3 పరీక్షలు

ఉమ్మడి జిల్లాలో మంగళవారం నుంచి ఫార్మేటివ్‌-3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తేదీ వరకు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1-8 తరగతులకు సీబీసీ (తరగతి ఆధారిత మదింపు) ఓఎమ్మార్‌ పత్రాలు ఇవ్వనున్నారు.

Updated : 07 Feb 2023 03:28 IST

నెల్లిమర్లలోని ఎమ్మార్సీలో ఓఎమ్మార్‌ పత్రాలను సిద్ధం చేస్తున్న సిబ్బంది

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో మంగళవారం నుంచి ఫార్మేటివ్‌-3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తేదీ వరకు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1-8 తరగతులకు సీబీసీ (తరగతి ఆధారిత మదింపు) ఓఎమ్మార్‌ పత్రాలు ఇవ్వనున్నారు. 9, 10 విద్యార్థులకు పూర్వ విధానంలోనే జరగనున్నాయి. ప్రైవేటు వారికి ఓఎమ్మార్‌ ఉండదు. రెండు యాజమాన్యాల్లో ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాల ఆధారంగానే పరీక్ష జరగనుంది. మొత్తం 2,37,895 మంది హాజరుకానున్నారని విజయనగరం డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు.

కేంద్రాల్లో..

తొలిరోజు విజయనగరం మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాల, సాలూరు వేదసమాజం, పార్వతీపురం జడ్పీలో ఓఎస్‌ఎస్‌సీ (ఓరియంటల్‌ సంస్కృతం) పరీక్షలు జరుగుతాయి. బుధవారం నుంచి మిగిలిన సబ్జెక్టులు నిర్వహిస్తారు. ప్రాథమిక తరగతులకు ఉదయం 10 నుంచి 11, మధ్యాహ్నం 2-3, ఆరు, ఏడు, ఎనిమిది వారికి మధ్యాహ్నం 1.30 నుంచి 2.30, తిరిగి 3 నుంచి 4 గంటల వరకు జరుగుతాయి. 9, 10 విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 10.15, 11 నుంచి 11.45 వరకు నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టుకూ 20 మార్కులుంటాయి.

మూల్యాంకనానికి సమయమివ్వాలి

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ఎఫ్‌ఏ-3 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి సమయమివ్వాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు డిమాండు చేశారు. 12 వ తేదీ లోపు మూల్యాంకనం పూర్తి చేసి, 14 నాటికి మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఈవో ఆదేశించడం సరికాదన్నారు. పరీక్షలు నిర్వహిస్తూ పేపర్లు ఎలా దిద్దుతామని ప్రశ్నించారు. సెలవు దినాలైన రెండో శనివారం, ఆదివారం పనిచేయడం సాధ్యం కాదన్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచి, మానసిక వేదనకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. మూల్యాంకనానికి కనీసం నాలుగు రోజులైనా సమయం ఇవ్వాలని డిమాండు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని