పేదల కంది పప్పు పక్కదారి!!
పేదలకు పౌరసరఫరాల శాఖ అందిస్తున్న కందిపప్పు పక్కదారి పడుతోంది. ఈ చిత్రంలో రోడ్డుపై కనిపిస్తున్న ఖాళీ సంచులే అందుకు నిదర్శనం.
పేదలకు పౌరసరఫరాల శాఖ అందిస్తున్న కందిపప్పు పక్కదారి పడుతోంది. ఈ చిత్రంలో రోడ్డుపై కనిపిస్తున్న ఖాళీ సంచులే అందుకు నిదర్శనం. రేషన్ కార్డున్న వారందరికీ చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం, నూనె, కంది పప్పు, పంచదార తదిరాలను రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. అయితే కొన్నిచోట్ల అవి పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొబ్బిలిలోని మేదరబంద సమీపంలోగల పురపాలిక వాణిజ్య సముదాయాల మెట్ల వద్ద కంది పప్పు ప్యాకెట్ల ఖాళీ సంచులు పడిఉన్నాయి. పప్పును వేరే కవర్లలోకి మార్చి వ్యాపారులు తెలివిగా విక్రయిస్తున్నారని పలువురు చెబుతున్నారు. రేషన్ దుకాణాల ద్వారా కిలో రూ.67లకు పప్పు ఇవ్వగా, బయట మార్కెట్లో రూ.90 నుంచి రూ.95 వరకు ధర పలుకుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకూ సరఫరా చేస్తుండడంతో ఈ కేంద్రాల నుంచి వెళ్లాయా? రేషన్ దుకాణాల నుంచి వెళ్లాయా? అన్నది తెలియాల్సి ఉంది. కొన్నిచోట్ల చక్కెర ప్యాకెట్లు ఇలాగే దారిమళ్లుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీనిపై పౌరసరఫరాల ఉప తహసీల్దారు సాయికృష్ణ వివరణ కోరగా ఆ సంచులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూస్‌టుడే, బొబ్బిలి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం