logo

గ్రామీణ రహదారులకు మోక్షం

రాష్ట్రంలో రహదారుల నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యంత్రాంగంలో కదలిక వచ్చింది. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు మరమ్మతులు చేసే దిశగా జిల్లాలో కసరత్తు జరుగుతోంది.

Published : 07 Feb 2023 03:41 IST

మరమ్మతులకు 20 మార్గాల గుర్తింపు

కొమరాడ మండలం అర్తాం నుంచి కళ్లికోటకు వెళ్లే రహదారి ఇది. గోతులమయంగా మారిన దీన్ని మరమ్మతులకు అధికారులు ప్రతిపాదించారు.

పార్వతీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రహదారుల నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యంత్రాంగంలో కదలిక వచ్చింది. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు మరమ్మతులు చేసే దిశగా జిల్లాలో కసరత్తు జరుగుతోంది. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అవసరమైన నిధులపై అంచనాలు రూపొందించాలని పీఆర్‌, ర.భ., ప్రజా పనులు, గిరిజన సంక్షేమ శాఖల అధికారులను కలెక్టరు నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. ఈ అంచనాలను బుధవారం నాటికి సమర్పిస్తే సీఎంవోకు పంపించనున్నారు.  
జిల్లాలో నియోజకవర్గానికి ఐదు రహదారుల చొప్పున 20 ప్రతిపాదించారు. వీటిని అత్యంత ప్రాధాన్యమున్న జాబితాలో చేర్చారు. ఇప్పటికే వీటిలో కొన్ని పనులు జరుగుతుండగా మిగిలినవి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నట్లు చూపారు.  


నియోజకవర్గాల వారీగా..

కురుపాం..

కొమరాడ మండలంలోని అర్తాం -కళ్లికోట (4.5 కి.మీ), గరుగుబిల్లి మండలంలోని వల్లరిగుడబ- రాయందొరవలస (2.5 కి.మీ), జియ్యమ్మవలస మండలంలోని బీజేపురం-తురకనాయుడువలస (7.7 కి.మీ), చినమేరంగి - పిప్పలభద్ర (4.4 కి.మీ), పూర్తిగా కోతకు గురైన కురుపాం మండలంలోని నీలకంఠాపురం-జరడ         (9 కి.మీ) మార్గం.

పార్వతీపురం..

పార్వతీపురం మండలం ఎన్‌.ములగ - డోకిశిల (5 కి.మీ) బలిజిపేట మండలం బర్లి - అరసాడ, అరసాడ-మురగడం, సీతానగరం మండలం బూర్జ -గాజులవలస, ఏగోటివలస మీదుగా గాదెలవలస వరకు.  

సాలూరు..

పాచిపెంట మండలం పద్మాపురం-ఏతంవలస, మెంటాడ మండలం లక్ష్మీపురం, పిట్టాడ, జయతి రోడ్లు.సాలూరు నుంచి మక్కువ వరకు ఉన్న రోడ్డును ప్రస్తుతం జాతీయ అభివృద్ధి బ్యాంకు నిధులతో మెరుగుపరుస్తున్నారు. ఇక్కడ సాలూరు పట్టణంలో పోస్టాఫీసు, శివాజీ బొమ్మ వద్ద రోడ్లను ప్రాధాన్యత జాబితాలో చేర్చారు.  

పాలకొండ..

సీతంపేట మండలం ముత్యాలు కూడలి నుంచి చాకలిగూడ వరకు (7 కి.మీ), తొత్తడి - బోయనగూడ, జంపరకోట - అచ్చబ, వీరఘట్టం మండలం సీపీఎస్‌ - చిమిడి (5 కి.మీ), నవగాం కూడలి -జంపరకోట మార్గాలకు మరమ్మతులు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని