logo

సీబీఐ అధికారినంటూ అప్పు

తాను సీబీఐ అధికారినంటూ సాలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తనవద్ద రూ.4.55 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, అడిగితే ఇవ్వడం లేదని రాజాంకు చెందిన మహిళ ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ వద్ద మొరపెట్టుకున్నారు.

Published : 07 Feb 2023 03:47 IST

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌

నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: తాను సీబీఐ అధికారినంటూ సాలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తనవద్ద రూ.4.55 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, అడిగితే ఇవ్వడం లేదని రాజాంకు చెందిన మహిళ ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ వద్ద మొరపెట్టుకున్నారు. సోమవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో వివిధ సమస్యలపై 33 ఫిర్యాదులు అందాయి.

* తన తల్లి ద్వారా వచ్చిన ఆస్తిని కాజేయడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని పూసపాటిరేగ మండలం తాళ్లపేటకు చెందిన మహిళ వినతిపత్రమిచ్చారు.

* కొబ్బరితోటలో కలుపు మొక్కలు ఏరుతుండగా కొందరు వ్యక్తులు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని గరివిడి మండలం దుమ్మేదకు చెందిన మహిళ ఫిర్యాదు చేశారు.

* తాను దివ్యాంగురాలినని, ఒంటరిగా నివసిస్తున్నానని, ఇంటి పక్కనున్న వ్యక్తి వేధిస్తున్నాడని నగరంలోని పూల్‌బాగ్‌ కాలనీలో ఉంటున్న బాధితురాలు ఎస్పీకు విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని