logo

ఈ ఓటమి జగన్‌దే: తెదేపా

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకోవాలని కలలు కన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంతపార్టీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కూడా కోల్పోయారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి డి.జగదీశ్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.చిరంజీవులు పేర్కొన్నారు.

Published : 24 Mar 2023 02:28 IST

పార్వతీపురంలో విజయసంకేతం చూపుతున్న పార్టీ నాయకులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకోవాలని కలలు కన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంతపార్టీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కూడా కోల్పోయారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి డి.జగదీశ్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.చిరంజీవులు పేర్కొన్నారు. తెదేపా అభ్యర్థిని పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో పార్వతీపురంలో సంబరాలు చేసుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. అధినేత చంద్రబాబునాయుడు ప్రణాళికతో విజయం వరించిందన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వైకాపా విధానాలను వ్యతిరేకించారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. ప్రజలు, పార్టీ విశ్వాసం కోల్పోయిన జగన్‌ పదవిలో కొనసాగడానికి అనర్హుడని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు ఉదయభాను, కె.వెంకటరావు, రవికుమార్‌, శ్రీనివాసరావు, గౌరునాయుడు, టి.వెంకటరమణ, జనార్దననాయుడు, తిరుపతిరావు, ప్రదీప్‌, భాస్కర్‌, కార్తిక్‌, రమణ, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబు ప్రణాళికతోనే విజయం

సాలూరు, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రణాళికతో తెదేపాకు తిరుగులేని విజయం దక్కిందని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఆమె నివాసంలో మాట్లాడారు.

మాట్లాడుతున్న సంధ్యారాణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని