ప్రారంభానికి ఎదురుచూపులు
జిల్లా ఆసుపత్రిలో పడకల ఇబ్బంది వేధిస్తోంది. రెండేళ్ల క్రితం వంద పడకల ఆసుపత్రిని 150కి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రోగుల తాకిడి పెరిగింది.
పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా ఆసుపత్రిలో పడకల ఇబ్బంది వేధిస్తోంది. రెండేళ్ల క్రితం వంద పడకల ఆసుపత్రిని 150కి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రోగుల తాకిడి పెరిగింది. దీంతో కొత్తగా వైద్యులను నియమించి పరికరాలను తీసుకొచ్చారు. ఇది బాగున్నా పడకలు చాలక రోగులు అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు 300 మందికి పైగా రోగులు వస్తుండటంతో ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. దీనికి తోడు నెలకు 300కు పైనే ప్రసవాలు జరుగుతుండటంతో బాలింతలు వారమైనా ఆసుపత్రిలో ఉంటున్నారు. ప్రసవానికి వచ్చిన వారు కొన్నిసార్లు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో గదులు సరిపోవడం లేదు. ప్రస్తుతం రూ.21 కోట్ల నాబార్డు నిధులతో ప్రత్యేక ప్రసూతి విభాగం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అది పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న బర్త్ వెయిటింగ్ హాలు, బాలల సత్వర చికిత్స కేంద్రాలను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. వీటిని పరిశీలించి త్వరలో ప్రారంభించనున్నట్లు ఏపీఎంఐఎస్‌డీసీ ఈఈ సత్యప్రభాకర్ తెలిపారు.
ఇది జిల్లా ఆసుపత్రి లోపల ఏర్పాటు చేసిన బర్త్ వెయిటింగ్ హాల్. 2020 డిసెంబరులో కేంద్రం విడుదల చేసిన రూ.30 లక్షలతో దీని నిర్మాణం ప్రారంభించారు. కొన్ని నెలల కిందటే భవనం సిద్ధమైనా సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. వీటిని అధికారులు సరిచేయించినా అందుబాటులోకి తీసుకురాలేదు.
రంగులతో సిద్ధంగా ఉన్న జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం భవనాన్ని రూ.1.06 కోట్లతో నిర్మించారు. గ్రహణమొర్రితో పాటు చిన్నారులకు వచ్చే రుగ్మతులకు వైద్య సేవలు ఇక్కడ అందించాల్సి ఉంది. ఈ భవనం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభించడం లేదు. దీనికి తోడు సంబంధిత వైద్యాధికారి, సిబ్బంది నియామకాలు జరగలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో బిడ్డకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు
-
Sports News
Snehasish Ganguly: ప్రపంచకప్ లోపు కవర్లు కొనండి: స్నేహశిష్ గంగూలీ
-
Politics News
దేవినేని ఉమా వైకాపాకు అనుకూల శత్రువు: వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు