logo

రీ సర్వేలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు భాగమవ్వాలి

గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేలో సచివాలయాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు భాగస్వాములై, ప్రక్రియను వేగవంతం చేయాలని సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ సూచించారు.

Published : 24 Mar 2023 02:28 IST

చిన్నదిమిలిలో రీసర్వేపై ఆరా తీస్తున్న సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌

భామిని, న్యూస్‌టుడే: గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేలో సచివాలయాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు భాగస్వాములై, ప్రక్రియను వేగవంతం చేయాలని సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ సూచించారు. గురువారం చిన్నదిమిలి, పెద్దదిమిలి, నులకజోడు గ్రామ సచివాలయాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న భూసర్వేను తనిఖీ చేశారు. భూ సమస్యలపై ఫిర్యాదులొస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్‌ నీలాపు అప్పారావు, ఎంపీడీవో జి.కృష్ణారావు, సర్వేయర్‌ రామ్‌మోహన్‌ తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు