logo

సీఎం దృష్టికి ఏనుగుల సమస్య

మన్యంలో సంచరిస్తున్న ఏనుగులతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వి.కళావతి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.

Published : 24 Mar 2023 02:28 IST

జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే కళావతి

సీతంపేట, భామిని, న్యూస్‌టుడే: మన్యంలో సంచరిస్తున్న ఏనుగులతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వి.కళావతి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈమేరకు గురువారం ఆయనకు వినతిపత్రం అందించారు. గజరాజుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని విన్నవించారు. జీవో నం.57ను సవరించాలని, భామిని మండలం చిన్నదిమిలి వద్ద వంశధార పిల్ల కాలువను మంజూరు చేయాలని, వీరఘట్టం, భామిని, బాలేరు, బత్తిలి పీహెచ్‌సీలను 50 పడకల సామాజిక ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. మరికొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని