logo

కొత్త ప్రాజెక్టులు నడిచేదెలా..?

జిల్లాల విభజన తర్వాత స్త్రీ, శిశు సంక్షేమశాఖలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకాలను విస్తరించారు.

Updated : 24 Mar 2023 05:18 IST

భవనాలు, సిబ్బంది లేమి

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాల విభజన తర్వాత స్త్రీ, శిశు సంక్షేమశాఖలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకాలను విస్తరించారు. అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్య యథాతథంగా ఉన్నా ఐసీడీఎస్‌ ప్రాజెక్టులను విడదీసి కొత్తవి ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో సాలూరు అర్బన్‌, వీరఘట్టం ప్రాజెక్టులు మూతపడ్డాయి. బలిజిపేట, కొమరాడ, భామినిలో కొత్తవి ఏర్పాటు చేసి పథక అధికారులను నియమించారు. వీరు బాధ్యతలు తీసుకున్నా ఎక్కడ, ఎలా పని చేయాలో అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. దీంతో కొత్త కేంద్రాలకు కార్యాలయాలు, సిబ్బంది, వాహనాలు లేకుండా పోయాయి.


సమకూరని భవనాలు..

కొత్త కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి వాటిలో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సూచంచారు. కానీ ఎక్కడా సరిపడే భవనాలు లభించడం లేదు. కార్యాలయంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలు, గుడ్లు, బాలామృతం, ఇతర పోషక పదార్థాలను భద్రపరిచేందుకు గోదాములు ఉండాలని చెప్పడంతో సరైన భవనాలు సమకూరడం లేదు. దీంతో పాటు పని చేసేందుకు సీనియర్‌ సహాయకులు, కంప్యూటరు ఆపరేటర్లు, కార్యాలయ సహాయకుడు, గోదాము పర్యవేక్షకుడు మొదలైన పోస్టుల్లో సిబ్బందిని నియమించాల్సి ఉంది.


స్పష్టత రాలేదు..

పాత ప్రాజెక్టులు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. రద్దు చేసిన వాటి నుంచి సామగ్రిని కొత్త వాటికి కేటాయించారు. ఏప్రిల్‌ తర్వాత ఫర్నీచరు, కంప్యూటర్లు, సామగ్రిని కొత్త ప్రాజెక్టులకు తీసుకురానున్నాం. వాహనాలను వినియోగించుకొనే వెసులుబాటు ఉంది. సిబ్బంది విషయంలో స్పష్టత రాలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు. వారంలో నిర్ణయం వెలువడే అవకాశముంది.
 కె.విజయగౌరి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారిత అధికారి, పార్వతీపురం మన్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని