విద్యార్థులు చదువు, ఇతర రంగాల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని జేెఎన్‌టీయూ ప్రిన్సిపల్ కె.శ్రీకుమార్ ఆకాంక్షించారు.
పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
విజయనగరం విద్యావిభాగం, పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని జేెఎన్‌టీయూ ప్రిన్సిపల్ కె.శ్రీకుమార్ ఆకాంక్షించారు. ఇందుకోసం ‘ఈనాడు’ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని, దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయనగరంలోని ఆర్‌కే డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల స్థాయి ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు వ్యాసరచన, స్టోరీ టెల్లింగ్, చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రికెట్‌లో ఏ విధంగా ఆల్‌రౌండర్‌కు గుర్తింపు ఉంటుందో అదే మాదిరిగా విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. ఇటువంటి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గెలుపోటములు ముఖ్యం కాదని భావించాలని, పోటీలో నిలవడమే గొప్ప విషయమన్నారు. ఓటమి పాలైతే అందుకు గల లోపాలు తెలుసుకొని తదుపరి పోటీల్లో పాల్గొన్నప్పుడు వాటిని సరిచేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ‘ఈనాడు’ తరఫున బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ‘ఈనాడు’ శ్రీకాకుళం యూనిట్ ఇన్‌ఛార్జి షేక్ కాలేషావలి, న్యాయనిర్ణేతలుగా విశ్రాంత సహాయక ప్రొఫెసర్ జక్కు రామకృష్ణ, టీవీ, సినీ ఆర్టిస్ట్ కె.నారాయణమూర్తి, సహాయక ప్రొఫెసర్ పీఎన్‌బీఆర్‌ఎస్‌ఎస్ శర్మ, సహాయక ప్రొఫెసర్ ఆర్.చిట్టిబాబు వ్యవహరించారు.
జిల్లా స్థాయిలో విజేతలు వీరే...
* డ్రాయింగ్: బి.యామిని సుష్మామృత (గీతాంజలి హైస్కూల్, విజయనగరం), ఎస్.హిమబిందు (శ్రీ ఆదిత్య ఇంగ్లీషు మీడియం హైస్కూల్, విజయనగరం), ఎ.నక్షత్ర (అభ్యుదయ హైస్కూల్, బొబ్బిలి)
* క్విజ్: కె.భరత్‌చంద్ర (నారాయణ ఇంగ్లీషు మీడియం ఈ టెక్నో పాఠశాల, విజయనగరం), జె.ఫణీంద్ర (గీతాంజలి హైస్కూలు, విజయనగరం), సీహెచ్ లోకేశ్ (ఎస్‌ఎస్ ఇంగ్లీషు మీడియం పాఠశాల, బొబ్బిలి)
* స్టోరీ టెల్లింగ్: వి.దీక్షిత్ (భాష్యం హైస్కూల్, విజయనగరం), జీవీ సాయిలాస్య (శ్రీ చలపతి హైస్కూల్, విజయనగరం), డి.దినేష్‌కుమార్ (లయన్స్ స్కూలు, పార్వతీపురం)
* వ్యాసరచన: ఎన్.జాస్మిన్ (ఫోర్టుసిటీ స్కూలు, విజయనగరం), సీహెచ్ నిత్య (అభ్యుదయ హైస్కూల్, బొబ్బిలి), ఎస్.ఉష అశ్రిత (ఫోర్టుసిటీ స్కూలు, విజయనగరం)
నాలుగు నెలలు.. 7,356 మంది విద్యార్థులు
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారిలోని నైపుణ్యాలను పెంపొందించేందుకు గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలల్లో పాఠశాల, ప్రాంతీయ, జిల్లాస్థాయిల్లో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. విజయనగరం, రాజాం, పార్వతీపురం, బొబ్బిలి కేంద్రాల్లో 19 పాఠశాలలకు సంబంధించి జరిగిన పోటీల్లో మొత్తం 7,356 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో సత్తా చాటిన 228 మంది ప్రాంతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇందులోనూ ప్రతిభ చూపిన 36 మంది జిల్లాస్థాయి పోటీలకు హాజరు కాగా వారిలో 12 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tirupati: తిరుపతిలో జూలో పెద్దపులి పిల్ల మృతి
-
General News
Road Accident: పుష్ప-2 షూటింగ్ నుంచి వస్తుండగా ప్రమాదం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి