logo

రోడ్డు ప్రమాదంలో కూలీ దుర్మరణం

కూలి పనుల కోసం వెళ్తూ ఓ ఇంటి పెద్ద దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. రేగిడి మండలం పారంపేట గ్రామానికి చెందిన కె.ధనుంజయ(35) గృహ నిర్మాణ పనులకు వెళ్తుంటాడు.

Updated : 24 Mar 2023 06:19 IST

ఘటనాస్థలంలో ధ్వంసమైన ద్విచక్రవాహనం

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: కూలి పనుల కోసం వెళ్తూ ఓ ఇంటి పెద్ద దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. రేగిడి మండలం పారంపేట గ్రామానికి చెందిన కె.ధనుంజయ(35) గృహ నిర్మాణ పనులకు వెళ్తుంటాడు. గురువారం ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై పార్వతీపురంలో జరుగుతున్న పనులకు బయలుదేరాడు. పాలకొండ మండలం అట్టలి కూడలి వద్దకు వచ్చేసరికి వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డుపై బలంగా పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు స్పందించి, 108లో పాలకొండ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై శివప్రసాద్‌ తెలిపారు. ధనుంజయకు భార్య మహాలక్ష్మితో పాటు మూడు నెలల కుమార్తె ఉంది. భర్త మృతితో ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని