logo

విశాఖలో కూలిన మూడంతస్తుల మేడ

విశాఖలోని  కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేట జిల్లా పరిషత్తు కార్యాలయం వద్ద బుధవారం అర్ధరాత్రి మూడంతస్తుల పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. 

Updated : 24 Mar 2023 03:21 IST

జిల్లాకు చెందిన ఇద్దరి మృత్యువాత

సహాయక చర్యల్లో పాల్గొన్న బృందాలు

ఈనాడు-విశాఖపట్నం, జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విశాఖలోని  కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేట జిల్లా పరిషత్తు కార్యాలయం వద్ద బుధవారం అర్ధరాత్రి మూడంతస్తుల పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.  ఈ ఘటనలో అన్నాచెల్లెళ్లు సాకేటి దుర్గాప్రసాద్‌(17), అంజలి(15),  ప్రాణాలు కోల్పోయారు. వీరి తల్లిదండ్రులు సాకేటి రామారావు, కల్యాణి గాయపడగా ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కల్యాణికి తలపై బలమైన గాయం కావడంతో న్యూరోసర్జరీ వార్డుకు తరలించామని, ప్రాణాపాయం లేనప్పటికీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని కేజీహెచ్‌ వైద్యులు చెప్పారు. రామారావు స్వగ్రామం విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గొల్లల మర్రివలస. కొన్నేళ్ల క్రితం విశాఖకు వెళ్లిపోయారు. అంజలి, దుర్గాప్రసాద్‌, బిహార్‌కు చెందిన చోటూ మృతదేహాలను శవపరీక్షల కోసం మార్చురీలో ఉంచారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి చేరుకోవడంతో విషాద వాతావరణం నెలకొంది.
 

బిడ్డలను కోల్పోయి విలపిస్తున్న రామారావు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని