logo

రైతుల ఆలోచనలు మారితే ఆర్థికవృద్ధి

ఆధునిక పద్ధతులను అవలంబించి వ్యవసాయం చేస్తే లాభదాయక ఫలితాలు ఉంటాయని గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్‌ విజయాభినందన పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 05:56 IST

నూతన వంగడాల పుస్తకాలు ఆవిష్కరిస్తున్న డీఈ, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు

గుమ్మలక్ష్మీపురం, కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆధునిక పద్ధతులను అవలంబించి వ్యవసాయం చేస్తే లాభదాయక ఫలితాలు ఉంటాయని గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్‌ విజయాభినందన పేర్కొన్నారు. రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం కిసాన్‌మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల తర్వాత కేవీకేలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. వ్యవసాయంలో రైతుల ఆలోచనలు మారితేనే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందన్నారు. నూతన వంగడాలు, వ్యవసాయ పరికరాలు, విస్తరణ కేంద్రాల గురించి వివరించారు. ఎంపీపీ పద్మావతి మాట్లాడుతూ కేవీకేని పర్యాటకంగా తీర్చిదిద్దడం సంతోషమన్నారు. అనంతరం గిరిజన నృత్యకారులు ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్నారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం సహ సంచాలకుడు సురేష్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త ముకుందరావు, కేవీకే ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్‌ పాత్ర్‌, రాగోలు వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త సత్యనారాయణ, సర్పంచి సునీత, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు సుజాత, టి.సునీత, ఉమ్మడి జిల్లాల రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని