logo

1.83 లక్షల మందికి రూ.94.18 కోట్ల లబ్ధి

వైఎస్సార్‌ ఆసరా కింద మూడో విడతలో 1.83 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.94.18 కోట్లు జమైనట్లు కలెక్టరు నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated : 26 Mar 2023 06:44 IST

ఆసరా నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టరు నిశాంత్‌కుమార్‌, ఎమ్మెల్యే జోగారావు

పార్వతీపురం, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ ఆసరా కింద మూడో విడతలో 1.83 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.94.18 కోట్లు జమైనట్లు కలెక్టరు నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నమూనా చెక్కును ఎమ్మెల్యే జోగారావుతో కలిసి మహిళలకు అందజేశారు. మూడు విడతల్లో రూ.314.92 కోట్లు అందించినట్లు వివరించారు. ప్రస్తుతం కురుపాం నియోజకవర్గంలోని 4,127 సంఘాలకు రూ.21.02 కోట్లు, పార్వతీపురంలో 4,428 సంఘాలకు రూ.26.45 కోట్లు, పాలకొండలో 4,506 సంఘాలకు రూ.30.07 కోట్లు, సాలూరులో 3,585 సంఘాలకు రూ.16.64 కోట్లు జమవుతాయని కలెక్టర్‌ తెలిపారు. పేదల కలలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని ఎమ్మెల్యే జోగారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శోభారాణి, జడ్పీటీసీ సభ్యురాలు రేవతమ్మ, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, ఏపీడీ సత్యంనాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని