logo

క్వారీలో బాంబు పేలుళ్లు ఆపాలని నిరసన

రైల్వే మూడో లైన్‌ పనులకు వినియోగించేందుకు కోటిపాం సమీపంలో రాళ్ల క్వారీని అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ రాళ్లు ముక్కలు చేసేందుకు బాంబులు పేల్చడంతో సమీపంలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయం బీటలు వారి గోడలు పడిపోయే స్థితికి చేరుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు

Published : 26 Mar 2023 06:01 IST

నిరసన తెలుపుతున్న ప్రజలు

కొమరాడ, న్యూస్‌టుడే: రైల్వే మూడో లైన్‌ పనులకు వినియోగించేందుకు కోటిపాం సమీపంలో రాళ్ల క్వారీని అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ రాళ్లు ముక్కలు చేసేందుకు బాంబులు పేల్చడంతో సమీపంలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయం బీటలు వారి గోడలు పడిపోయే స్థితికి చేరుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. క్వారీలో పేలుళ్లు నిలిపేయాలని శనివారం నిరసన చేపట్టారు. ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టొద్దని గతంలోనే యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని