logo

మృతి చెందిన వారికీ వేతనాల చెల్లింపు

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2020-21లో పాచిపెంట మండలంలో రూ.13.61 కోట్లతో చేపట్టిన పనులపై శనివారం సామాజిక తనిఖీ నిర్వహించారు.

Published : 26 Mar 2023 06:01 IST

సామాజిక తనిఖీల్లో వెలుగులోకి

ఉద్యోగులను ప్రశ్నిస్తున్న పీడీ రామచంద్రరావు

పాచిపెంట, న్యూస్‌టుడే: జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2020-21లో పాచిపెంట మండలంలో రూ.13.61 కోట్లతో చేపట్టిన పనులపై శనివారం సామాజిక తనిఖీ నిర్వహించారు. అయితే పలు పంచాయతీల్లో మృతిచెందిన వ్యక్తుల పేరుతో చెల్లింపులు, కొలతల్లో తేడాలు, వేతనదారుల వేలిముద్రలు లేకపోవడం, పే స్లిప్పులు ఇవ్వకపోవడం తదితర అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ తనిఖీ బృందాలు ఉపాధి పీడీ రామచంద్రరావుకు నివేదికలు అందజేశాయి. మర్రిపాడు, తంగాలం, గరిసిగుడ్డిలో మృతిచెందిన కె.గంగయ్య, ఎస్‌.సంజీవరావు, ఎస్‌.రామయ్య, చిన్నయ్య, ఎస్‌.లచ్చయ్యకు వేతనాల చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. పాస్‌ ఆర్డరు లేకుండా పనులు చేపట్టినట్లు, గిరిజన రైతులకు అందించిన మొక్కలు చనిపోవడంతో రూ.లక్షలు దుర్వినియోగమైనట్లు పీడీ తెలిపారు. మళ్లీ మొక్కలు నాటి, రక్షించాల్సిన బాధ్యత క్షేత్ర, సాంకేతిక సహాయకులదేనన్నారు. సిబ్బంది నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు కొందరు అధికారులు గైర్హాజరవడం, మరికొందరు ఆలస్యంగా రావడం, కిందిస్థాయి సిబ్బందిని పంపించడంపై పీడీ మండిపడ్డారు. ఆయన వెంట ఎస్సార్పీ బి.సూర్యారావు, ఏపీడీ శ్రీహరి, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌, ఏపీవో మహేష్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని