logo

ఆత్మస్థైర్యంతో సాగితే విజయం సొంతం

ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం సొంతమవుతుందని బెంగుళూరుకు చెందిన విప్రో గ్లోబల్‌ జనరల్‌ మేనేజర్‌ కె.ప్రవీణ్‌కామత్‌ అన్నారు.

Published : 26 Mar 2023 06:01 IST

కళాశాల వార్షిక సంచికను ఆవిష్కరిస్తున్న ప్రవీణ్‌ కామత్‌ తదితరులు

డెంకాడ, న్యూస్‌టుడే: ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం సొంతమవుతుందని బెంగుళూరుకు చెందిన విప్రో గ్లోబల్‌ జనరల్‌ మేనేజర్‌ కె.ప్రవీణ్‌కామత్‌ అన్నారు. డెంకాడ మండలంలోని లెండి ఇంజినీరింగ్‌ కళాశాల 15వ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రయోగాత్మక, పరిశోధనాత్మక ధోరణితో విద్యాభ్యాసం సాగించాలని,, అందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల వార్షిక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గతవిద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించి అభినందించారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి.వి.రామారెడ్డి, ఛైర్మన్‌ పి.మధుసూధనరావు, కార్యదర్శి కె.శివరామకృష్ణ, వైస్‌ ప్రిన్సిపల్స్‌ టి.హరిబాబు, ఏ.వి.పరాంకుశం, ప్లేస్‌మెంట్‌ డీన్‌ జి.ప్రకాష్‌బాబు, విభాగాధిపతులు ఎ.రామారావు, రాజేంద్ర, సుబ్బరామయ్య, సతీష్‌, దుర్గాశైలజ, జి.సతీష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని