logo

బాలిక అదృశ్యం: సిబ్బందికి నోటీసులు

బాలిక అదృశ్యం కేసులో రావివలస కేజీబీవీ ప్రత్యేకాధికారిణి ఛాయాదేవికి డీఈవో రమణ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Published : 26 Mar 2023 06:05 IST

కేజీబీవీ సిబ్బందిని విచారిస్తున్న ఎంఈవో

గరుగుబిల్లి గ్రామీణం: బాలిక అదృశ్యం కేసులో రావివలస కేజీబీవీ ప్రత్యేకాధికారిణి ఛాయాదేవికి డీఈవో రమణ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న కాపలాదారుడ్ని సస్పెండ్‌ చేశారు. ఈ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఇటీవల బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై డీఈవో విచారణ నిర్వహించి చర్యలు చేపట్టారు. ఉద్యోగులు, విద్యార్థుల నుంచి ఎంఈవో నాగభూషణరావు శనివారం వివరాలు సేకరించారు. మరోవైపు ఎస్సై రాజేశ్‌ దర్యాప్తు చేపట్టారు. చరవాణి ఆధారంగా బాలిక విశాఖలో ఓ వ్యక్తి వద్ద ఉన్నట్లు గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని