logo

నైపుణ్యాభివృద్ధితో ఉన్నత శిఖరాలు

విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ నిష్ణాతుడు, సుప్రీం కోర్టు న్యాయవాది, కార్పొరేట్‌ కన్సెల్టెంట్‌ డాక్టర్‌ ప్రభాత్‌ కుమార్‌ సూచించారు.

Published : 26 Mar 2023 06:35 IST

మాట్లాడుతున్న ప్రభాత్‌కుమార్‌

రాజాం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ నిష్ణాతుడు, సుప్రీం కోర్టు న్యాయవాది, కార్పొరేట్‌ కన్సెల్టెంట్‌ డాక్టర్‌ ప్రభాత్‌ కుమార్‌ సూచించారు. శనివారం రాజాంలోని జీఎంఆర్‌ఐటీ 25వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన సభలో ప్రసంగిస్తూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. గౌరవ అతిథి పి.రవికిరణ్‌ మాట్లాడుతూ స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. జీఎంఆర్‌వీఎప్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గిరీష్‌, కళాశాల ప్రిన్సిపల్‌ సీఎల్‌వీఆర్‌ఎస్వీ.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని