మల్లెల గుబాళింపు మాయం
మల్లెపూలు అనగానే ఠక్కున గుర్తుకువచ్చేది సాలూరు. గతంలో ఇక్కడ 150 ఎకరాలకు పైగా మల్లె తోటలుండేవి. వేసవి వస్తే పూలకు మంచి గిరాకీ ఉండేది.
150 నుంచి 5 ఎకరాలకు తగ్గిన విస్తీర్ణం
మల్లెపూలు ఏరుతున్న కూలీలు
సాలూరు, న్యూస్‌టుడే: మల్లెపూలు అనగానే ఠక్కున గుర్తుకువచ్చేది సాలూరు. గతంలో ఇక్కడ 150 ఎకరాలకు పైగా మల్లె తోటలుండేవి. వేసవి వస్తే పూలకు మంచి గిరాకీ ఉండేది. నాలుగు నెలల పాటు కాపు వచ్చినా ఏడాది పొడవునా రైతులు పెంపకంపై దృష్టి సారించేవారు. మొగ్గలు, పూలు ఏరుతూ వందల మంది కూలీలు ఉపాధి పొందేవారు. శివాలయం రోడ్డు నుంచి వేగావతి వరకు ఇరువైపులా తోటలు కనువిందు చేసేవి. అదంతా గతం.. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో తోటలకు నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కూలీలకు పనులు లేక నష్టాలను తట్టుకోలేక సాగును వదిలి ఇతర పంటల వైపు మొగ్గు చూపారు.
ఎగుమతి నుంచి దిగుమతికి..
వివాహ, శుభకార్యాలు జరిగితే మల్లెలకు గిరాకీ ఏర్పడేది. లీటరు డబ్బాతో మల్లెలు రూ.30 నుంచి రూ.40 వరకు ధర పలికేవి. పంట ఎక్కువగా వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం ఉండేది కాదు. స్థానికంగా పండినవి విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు క్వింటాళ్ల కొద్దీ లారీలు, బస్సుల్లో ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం స్థానికంగా పంట లేకపోవడంతో ఆనందపురం కూడలి నుంచి సాలూరుకు దిగుమతి చేసుకుంటున్నారు. గతంలో పట్టణ జాతీయ రహదారి పక్కన కనిపించిన పది నుంచి ఇరవై దుకాణాలు ఇప్పుడు కన్పించడం లేదు.
కనుమరుగు ఖాయం..
ప్రస్తుతం సాగు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. 150 ఎకరాల నుంచి మల్లె తోటలు 5 ఎకరాలకు పడిపోయాయి. ఆ స్థానంలో అరటి, మొక్కజొన్న, కూరగాయల సాగు పెరిగింది. గులాబీలు, కాగడాలు, బంతి, చామంతి తదితర రకాల పూల మొక్కలు మరో ఐదెకరాల్లో సాగవుతున్నాయి. ఈ విస్తీర్ణం కూడా మరికొన్నాళ్లలో తగ్గిపోనుందని రైతులు చెబుతున్నారు.
పరిహారం రావడం లేదు..
-టి.శంకరరావు, రైతు, సాలూరు
మల్లెసాగు చేసే రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంటకు నష్టం వస్తే సాయం రావడం లేదు. వాణిజ్య పంటలు అరటి, మొక్కజొన్న లాంటి వాటికి పరిహారం ఇస్తున్నారు. కానీ మల్లె రైతులను పట్టించుకోవడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తున్నాం.
గతంలో స్థానికంగా సాగయ్యే మల్లెపూలను రోజూ క్వింటాళ్ల కొద్దీ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవాళ్లం. పూల వ్యాపారంపైనే పట్టణంలో సుమారు 50 కుటుంబాలు ఆధారపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కూలీలు కూడా రాకపోవడంతో రైతులు రోడ్లపైనే విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి.
సూరి, పూలవ్యాపారి, సాలూరు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన.. కేంద్రమంత్రి అర్ధరాత్రి ట్వీట్
-
Movies News
father characters: తండ్రులుగా జీవించి.. ప్రేక్షకుల మదిలో నిలిచి!
-
Politics News
YVB Rajendra Prasad: తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Ponguleti: విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం