logo

హక్కుల్ని హరిస్తోంది

గిరిజనుల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. ఆదివారం ఆమె నివాసంలో గిరిజన సంఘ నేతలతో మాట్లాడారు.

Published : 27 Mar 2023 04:33 IST

సమావేశంలో మాట్లాడుతున్న సంధ్యారాణి

సాలూరు, న్యూస్‌టుడే: గిరిజనుల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. ఆదివారం ఆమె నివాసంలో గిరిజన సంఘ నేతలతో మాట్లాడారు. రిజర్వేషన్లు పెంచకుండా బోయ, వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చడం ముమ్మాటికీ ఆదివాసీలను అణచివేసేందుకే అన్నారు. గిరిజనులకు మేలు చేసే జీవోను కాలరాశారని ఆరోపించారు. గిరిజనుల ఓట్లతో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర గిరిజనుల తరపున మాట్లాడరా...? అని ఆమె ప్రశ్నించారు. ఈ సమావేశంలో గిరిజన నేతలు కోట లక్ష్మణ, బి. రామన్నదొర, సీహెచ్‌. వెంకటి, దొర లక్ష్మణ ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు