logo

బాధితులకు రూ.1.62 లక్షల సాయం

గత నెల 22న మండలంలోని చోళపదంలో ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో అంటివలసకు చెందిన ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Published : 27 Mar 2023 04:33 IST

నగదు అందజేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు

కొమరాడ, న్యూస్‌టుడే: గత నెల 22న మండలంలోని చోళపదంలో ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో అంటివలసకు చెందిన ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత కుటుంబాల సభ్యులకు గిరిజన ఉద్యోగుల సంఘం (కొమరాడ) తరఫున ఆదివారం రూ.1,62,200 అందజేశారు. తల్లిని కోల్పోయి, అంధుడైన తండ్రి సంరక్షణలో ఉన్న ముగ్గురు పిల్లలకు రూ.45 వేలు, 6 కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున, క్షత్రగాత్రులు నలుగురికి రూ.5 వేలు చొప్పున ఇచ్చారు. జనవరిలో సరుగుడగూడ వద్ద జరిగిన ట్రక్కర్‌ బోల్తాపడిన ప్రమాదంలో మృతి చెందిన అల్లువాడుకు చెందిన హిమరిక హరికృష్ణ కుటుంబానికి రూ.35 వేలు అందజేశారు. ఐదుగురు చిన్నారులకు రూ.2 వేలతో సామగ్రి కొనిచ్చారు. ఉద్యోగులు పి.రాజారావు, సీహెచ్‌.సీతారాం, పి.లక్ష్మణరావు, నాగేశ్వరరావు, వెంకటరావు, పి.బృందావనరాయుడు, భూపతిదొర, హెచ్‌.అప్పారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని