logo

ప్రభుత్వ తీర్మానంపై ఆందోళన

బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానించడాన్ని ప్రతి గిరిజనుడు వ్యతిరేకించాలని ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ గౌరవాధ్యక్షుడు నిమ్మక జయరాజు, అధ్యక్షుడు కె.ధర్మారావు కోరారు.

Published : 27 Mar 2023 04:33 IST

పార్వతీపురం: ప్రదర్శనలో పాల్గొన్న గిరిజనులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానించడాన్ని ప్రతి గిరిజనుడు వ్యతిరేకించాలని ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ గౌరవాధ్యక్షుడు నిమ్మక జయరాజు, అధ్యక్షుడు కె.ధర్మారావు కోరారు. పార్వతీపురంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేపట్టారు. వైకాపాలో రాజకీయ పదవులు, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న గిరిజనులు రాజీనామా చేసి పోరాటంలోకి రావాలన్నారు.  

ఎంపిక..: ఆదివాసీ జేఏసీ కొత్త కార్యవర్గాన్ని ఆదివారం ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే జయరాజును గౌరవ అధ్యక్షుడిగా నియమించారు. ఛైర్మన్‌గా కె.ధర్మారావు, ప్రధానకార్యదర్శిగా కె.జయన్న, కోశాధికారిగా ఎ.మాధవరావు, ఎనిమిది మంది ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మణమూర్తి, విశ్రాంత డిప్యూటీ కలెక్టరు ఎ.నీలకంఠం, పత్తిక లక్ష్మయ్యలను సలహాదారులుగా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని