logo

రాములోరి కల్యాణానికి వేళాయె

రెండో భద్రాద్రిగా పేరొందిన రామతీర్థంలో శ్రీరాముడి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు స్వామి కల్యాణ ఉత్సవ క్రతువు ప్రారంభమవుతుందని అర్చకులు పేర్కొన్నారు.

Updated : 30 Mar 2023 02:32 IST

ఉత్సవమూర్తులు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: రెండో భద్రాద్రిగా పేరొందిన రామతీర్థంలో శ్రీరాముడి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు స్వామి కల్యాణ ఉత్సవ క్రతువు ప్రారంభమవుతుందని అర్చకులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం తంతు, అనంతరం మాంగళ్యధారణ, ముత్యాల తలంబ్రాలు పోసే ఘట్టాన్ని నిర్వహిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అన్నసమారాధన ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి.

సిద్ధం చేసిన వేదిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని