logo

పది విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వొద్దు

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు.

Published : 30 Mar 2023 02:14 IST

అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, చిత్రంలో డీఈవో రమణ

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. పరీక్షలకు 64 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పరిశీలనకు సూపరింటెండెంట్లు, శాఖాధికారులతో పాటు ఇన్విజిలేషన్‌కు 650 మంది, 12 మంది రూట్‌ అధికారులు, మూడు ఫ్లయింగ్‌  స్క్వాడ్‌లను     నియమించామన్నారు. కేంద్రాలకు కి.మీ. పరిధిలో ఉన్న జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. వైద్యసేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా బెంచీలు, టేబుళ్లను ఏర్పాటు చేయాలని, అవసరమైన రూట్లలో బస్సులు తిప్పాలన్నారు. సార్వత్రిక విద్యలో పది, ఇంటర్‌ పరీక్షలకు ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డీఈవో ఎస్డీవీ రమణ, డీఎస్పీ సుభాష్‌, డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు, డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీరావు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని