logo

వ్యాధుల పంజా

సీతంపేట మన్యంతో పాటు మైదాన ప్రాంతాల్లో తీవ్ర ఎండలకు తోడు వర్షాలు పడుతుండడంతో జ్వరాలతో పాటు జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఆయాసం, ఒళ్లు, కాళ్ల పీకులు, ఇతరత్ర రుగ్మతలతో చిన్నా, పెద్ద మంచం పడుతున్నారు.

Published : 30 Mar 2023 02:14 IST

సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రి సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మన్యంతో పాటు మైదాన ప్రాంతాల్లో తీవ్ర ఎండలకు తోడు వర్షాలు పడుతుండడంతో జ్వరాలతో పాటు జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఆయాసం, ఒళ్లు, కాళ్ల పీకులు, ఇతరత్ర రుగ్మతలతో చిన్నా, పెద్ద మంచం పడుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లోని విద్యార్థులను ఆసుపత్రులకు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. బుధవారం ఓపీకి ఎక్కువ మంది వచ్చి వైద్యసేవలు పొందారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ విష జ్వరాలు, జలుబు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు. అనారోగ్యానికి గురైన వారు నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రుల్లో చూపించుకుని వైద్యసేవలు పొందాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని