logo

రూ.20 లక్షల కృత్రిమ అవయవాల పంపిణీ

కొత్తవలస మండలంలోని మంగళపాలెంలో శ్రీగురుదేవ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అవంతి ఫౌండేషన్‌ ఆర్థికసాయం రూ.20 లక్షలతో 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను బుధవారం పంపిణీ చేశారు.

Updated : 30 Mar 2023 02:33 IST

కృత్రిమ కాలు గురించి వివరిస్తున్న జగదీష్‌కుమార్‌

కొత్తవలస, న్యూస్‌టుడే:  కొత్తవలస మండలంలోని మంగళపాలెంలో శ్రీగురుదేవ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అవంతి ఫౌండేషన్‌ ఆర్థికసాయం రూ.20 లక్షలతో 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను బుధవారం పంపిణీ చేశారు. అవంతి ఫీడ్స్‌ లిమిటెడ్‌ కార్యనిర్వాహక సంచాలకుడు, అవంతి ఫౌండేషన్‌ ట్రస్టీ అల్లూరి వెంకట సంజీవ్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ అల్లూరి కావ్య ముఖ్య అతిథులుగా హాజరై వీటిని లబ్ధిదారులకు అందజేశారు. ఇద్దరు దివ్యాంగులకు ఎలక్ట్రికల్‌ ట్రైసైకిళ్లు ఇచ్చారు. కాకినాడ తదితర ప్రాంతాల నుంచి లబ్ధిదారులు తరలి వచ్చారు.

కొత్తవలస: విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 300 గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణ కోసం శ్రీగురుదేవ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సుమారు రూ.3 లక్షల విలువ చేసే పూజా సామగ్రిని అందజేసినట్లు ట్రస్టు ఛైర్మన్‌ రాపర్తి జగదీష్‌కుమార్‌ తెలిపారు. ఒక్కో గ్రామానికీ రూ.3 వేల విలువైన సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ప్రతిమలు, పూజా సామగ్రి, సారె, వస్త్రాలు, బియ్యం ఇచ్చామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని