logo

చెరువు గట్లపై 200 అక్రమ నిర్మాణాలు

బొబ్బిలి పట్టణంలోని చెరువులు, గట్లు ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టడంతో వామపక్షాల ఆందోళనల మేరకు ఆర్డీవో శేషశైలజ బుధవారం పరిశీలించారు.

Updated : 30 Mar 2023 02:34 IST

అధికారులకు సూచనలు చేస్తున్న ఆర్డీవో శేషశైలజ

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి పట్టణంలోని చెరువులు, గట్లు ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టడంతో వామపక్షాల ఆందోళనల మేరకు ఆర్డీవో శేషశైలజ బుధవారం పరిశీలించారు. తారకరామ కాలనీలోని చీపురుబంద ఆక్రమించి రహదారి వేయడంతో దాన్ని తనిఖీ చేసి.. సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కళాభారతిని ఆనుకున్న రాణిమల్లమ్మ చెరువు, రాతిపనివారి గట్లపై అక్రయ కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అధికార పార్టీ కౌన్సిలర్లు చేసిన ఫిర్యాదు మేరకు అమ్మిగారి కోనేరును చూశారు. గతంలో చేపట్టిన నిర్మాణాలను విడిచిపెట్టి.. కొత్త భవనాలు, ఇతర పనులను వెంటనే ఆపేయాలని స్థానిక అధికారులకు సూచించారు. పట్టణంలోని చెరువు గట్లపై 200 వరకు అక్రమ నిర్మాణాలు ఉంటాయని, దీనిపై కలెక్టర్‌కు నివేదిస్తామని ఆర్డీవో ఈ సందర్భంగా విలేకర్లకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని