logo

రాష్ట్రస్థాయిలో కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ

జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి వ్యవస్థాపక మానసికాభివృద్ధి(ఈఎండీపీ ఎక్స్‌పో) పోటీల్లో సీతానగరంలోని కేజీబీవీలో చదువుతున్న నవ్యశ్రీ, జ్యోత్స్న, ధనలక్ష్మి పాల్గొని మూలికలతో తయారైన సానిటరీ మెత్తలను(హెర్బల్‌ సానిటరీ పాడ్స్‌) ప్రదర్శించారు.

Updated : 30 Mar 2023 02:34 IST

బాలికలను అభినందిస్తున్న డీఈవో రమణ, అధికారులు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి వ్యవస్థాపక మానసికాభివృద్ధి(ఈఎండీపీ ఎక్స్‌పో) పోటీల్లో సీతానగరంలోని కేజీబీవీలో చదువుతున్న నవ్యశ్రీ, జ్యోత్స్న, ధనలక్ష్మి పాల్గొని మూలికలతో తయారైన సానిటరీ మెత్తలను(హెర్బల్‌ సానిటరీ పాడ్స్‌) ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి పది స్థానాల్లో నిలిచిన వారిలో వీరు కూడా ఉన్నారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో డీఈవో ఎస్‌డీవీ.రమణ అభినందించారు. డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీరావు, ఏడీ వెంకటేశ్వరరావు, ఏఎంవో రాజేశ్వరి, జీసీడీవో రోజారమణి, గైడ్‌ టీచర్‌ సరోజినీదేవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని