logo

చెరకు కూలీలపై పిడుగుపాటు

మండలంలోని సంగాం గ్రామ సమీపంలో చెరకు పనులు చేస్తుండగా శనివారం సాయంత్రం పిడుగు పడడంతో అదే గ్రామానికి చెందిన ఎం.లక్ష్మి...

Published : 02 Apr 2023 05:33 IST

అపస్మారక స్థితికి చేరిన నలుగురు

పిడుగుపాటుకు అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలు

వంగర, న్యూస్‌టుడే: మండలంలోని సంగాం గ్రామ సమీపంలో చెరకు పనులు చేస్తుండగా శనివారం సాయంత్రం పిడుగు పడడంతో అదే గ్రామానికి చెందిన ఎం.లక్ష్మి, యడ్ల హైమావతి, బి.జ్యోతి, పైల తవిటిరాజు తదితరులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురుస్తున్నపుడు పొలం పనులు చేస్తుండగా సమీపంలో పిడుగు పడింది. భయాందోళనకు గురైన బాధితులు అపస్మారక స్థితికి జారుకున్నారు. వీరికి స్థానికంగానే ప్రైవేటు వైద్యం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు