logo

బాల్య వివాహాలకు హాజరైనా కేసులే

బాల్య వివాహాలు చేయడమే కాదు.. వాటికి హాజరైన వారిపైనా కేసు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు.

Published : 02 Apr 2023 05:33 IST

మాట్లాడుతున్న అప్పారావు

గుర్ల, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చేయడమే కాదు.. వాటికి హాజరైన వారిపైనా కేసు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు. శనివారం గుర్ల మండల పరిషత్తు కార్యాలయంలో బాల్య వివాహాల నియంత్రణపై ఐసీడీఎస్‌ పీడీ శాంతకుమారి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధక కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 200 కేసులు నమోదయ్యాయన్నారు. గంజాయికి యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 3700 గంజాయి కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోలీసులు దీనిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో గుర్ల ఎంపీపీ ప్రమీల, జడ్పీటీసీ అప్పలనాయుడు, వైస్‌ ఎంపీపీ తిరుపతిరావు, ఎంపీడీవో కల్యాణి, డీటీ సూర్యనారాయణ, ఎస్‌ఐ శిరీష, ఎంఈవో భానుప్రకాష్‌, ఐసీడీఎస్‌ పీవో ఆరుద్ర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని