logo

ఫుట్‌బాల్‌ క్రీడాకారుడి సందడి

ప్రపంచ ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ సిల్వర్‌ పతక గ్రహీత, భారత సంతతికి చెందిన డి.వికాస్‌ శనివారం రాజీవ్‌ మైదానంలో సందడి చేశారు.

Published : 02 Apr 2023 05:37 IST

వికాస్‌ను సత్కరిస్తున్న నిర్వాహకులు

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ప్రపంచ ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ సిల్వర్‌ పతక గ్రహీత, భారత సంతతికి చెందిన డి.వికాస్‌ శనివారం రాజీవ్‌ మైదానంలో సందడి చేశారు. 2006లో ప్రపంచ ఫుట్‌బాల్‌ పోటీల్లో ఫ్రాన్స్‌ తరఫున ఆడి ఆ జట్టు ద్వితీయ స్థానంలోకి చేరడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పూర్వీకులు నగరంలో నివాసం ఉండటంతో భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చి కొంతసేపు గడిపారు. ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు రజనీకుమార్‌, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని