logo

చేతికందే పంటలు నేలపాలు

మక్కువ మండలం మార్కొండపుట్టి, కవిరిపల్లి, దబ్బగడ్డ, మక్కువ, కోన, యర్రసామంతవలస పంచాయతీల పరిధిలో శనివారం ఈదురు గాలులు, వర్షం కారణంగా మొక్కజొన్న, అరటి రైతులు కుదేలయ్యారు.

Published : 02 Apr 2023 05:57 IST

మక్కువ సమీపంలో నేలకూలిన మొక్కజొన్న

మక్కువ, న్యూస్‌టుడే: మక్కువ మండలం మార్కొండపుట్టి, కవిరిపల్లి, దబ్బగడ్డ, మక్కువ, కోన, యర్రసామంతవలస పంచాయతీల పరిధిలో శనివారం ఈదురు గాలులు, వర్షం కారణంగా మొక్కజొన్న, అరటి రైతులు కుదేలయ్యారు. 12 సచివాలయాల పరిధిలో 245 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ సిబ్బంది తెలిపారు. ఉద్యాన పరిధిలో అరటి 160 ఎకరాలు, జీడి 3.8 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వివరించారు. మామిడి, జీడి కూడా రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. మండలంలో మరమ్మతులకు గురైన ఏడు విద్యుత్తు నియంత్రికలను ఏఈ శాంతారావు ఆధ్వర్యంలో మరమ్మతులు జరిపి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని