ఉద్యాన రైతు చూపు.. రాయితీ వైపు
ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా రాయితీల సొమ్ము జమ కావడం లేదు.
మూడేళ్లుగా అందని పథకాలలబ్ధి
న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం
ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా రాయితీల సొమ్ము జమ కావడం లేదు. గత మూడేళ్లుగా అందక అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సకాలంలో రాయితీ సొమ్ము రాకపోవడంతో పెట్టుబడులకు చేసిన అప్పులపై వడ్డీ భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఉద్యాన పంటల సాగు ఎక్కువ. జిల్లావ్యాప్తంగా 58 వేల మంది రైతులు 1,01,017 ఎకరాల్లో మామిడి, బొప్పాయి, అరటి, జామ, అనాస, జీడి, కొబ్బరి, ఆయిల్ పామ్, టమాటా, వంకాయలు, చిక్కుళ్లు, పొట్లకాయలు, దుంప జాతులు, అల్లం, పసుపు, ఔషధ మొక్కలు, పూలు తదితర పంటలు సాగు చేస్తున్నారు. రైతులు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3.19 కోట్లు రాయితీ నిధులు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు నివేదికలు పంపారు.
అందేది ఎప్పటికో...
జిల్లాలో పండ్లు, కూరగాయలు, పూల తోటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ఎంఐడీహెచ్ కింద గతేడాది రూ.93.73 లక్షలు, ఆర్‌కేవీవై కింద గత మూడేళ్లలో రూ.2.26 కోట్లు రాయితీ నిధులు ఇవ్వాలని జిల్లా నుంచి ఉద్యాన అధికారులు ఏటా ప్రతిపాదలు చేస్తున్నారు. కానీ.. ఇప్పటికీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు. ప్రతిపాదించిన మొత్తం వస్తుందా? అందులో కోత ఉంటుందా? అసలు జిల్లాకు ఎన్ని రూ.కోట్లు ఇస్తారనే విషయంలో స్పష్టత ఇంకా రాలేదు.
మార్కెట్‌లో ధరల మంట..
కూరగాయలు, పండ్ల విత్తనాల ధరలు ఆకాశాన్ని తాకాయి. కిలో రూ.వేలల్లో ఉండడంతో కొనేందుకు రైతులు అప్పులు చేస్తున్నారు. దానికి తోడు చీడ, పీడల నుంచి పంటల రక్షణకు ద్రావణాలు పిచికారీ చేసేందుకు సంబంధిత పరికరాల ధరలూ రూ.వేలల్లో ఉంటున్నాయి. గతంలో వీటన్నింటికీ ప్రభుత్వం రాయితీ అందించి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేది. మూడేళ్లుగా వాటిని అందించడం లేదు.
రుణమే శరణ్యం..
ఏ పంట వేయాలన్నా రైతులకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. దుక్కులు, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలు, కలుపుతీత, బిందుసేద్యం పరికరాలకు మదుపు పెట్టాల్సిందే. గతేడాది అధిక వర్షాలు, ఇతర కారణాలతో పంటలు దెబ్బతినడంతో ఎక్కువ మంది రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రాయితీ వస్తుందన్న ధీమాతో వడ్డీకి తెచ్చి పెట్టుబడులు పెట్టారు. ఆలస్యమైతే వడ్డీల భారం పడనుందంటున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదించాం
- సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, పార్వతీపురం
జిల్లాలో సాగవుతున్న ఉద్యాన పంటల వారీగా ఏటా రాయితీ నిధులకు ప్రతిపాదనలు చేస్తున్నాం. నిధులు వస్తే రైతుల ఖాతాలకు జమ చేస్తాం. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్లో రకుల్
-
India News
Odisha Train Tragedy: ‘కవచ్ ఉన్నా కాపాడేది కాదు’ : వందేభారత్ రూపకర్త
-
General News
CBI: ఆ రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. 7గంటలపాటు అవినాష్ సీబీఐ విచారణ
-
General News
Andhra News: రైలు ప్రమాదం.. 141 మంది ఏపీ వాసుల కోసం ప్రయత్నిస్తున్నాం: బొత్స
-
Sports News
Sachin: అర్జున్.. నీ ఆటపై శ్రద్ధ పెట్టు.. తనయుడికి సూచించిన సచిన్ తెందూల్కర్
-
Movies News
Aishwarya Lekshmi: నటిని అవుతానంటే నా తల్లిదండ్రులే వ్యతిరేకించారు: ఐశ్వర్య లక్ష్మి