logo

మరో 9 రహదారులు

ఇటీవల జిల్లాలో అయిదు రహదారులకు అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కలెక్టర్‌ అధ్యక్షతన అటవీ హక్కుల పరిశీలన కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

Published : 28 May 2023 02:29 IST

అటవీ అనుమతులు మంజూరు

సమావేశమైన కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో కల్పనాకుమారి, డీఎఫ్‌వో ప్రసూన, అధికారులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: ఇటీవల జిల్లాలో అయిదు రహదారులకు అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కలెక్టర్‌ అధ్యక్షతన అటవీ హక్కుల పరిశీలన కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. శనివారం మరోసారి సమావేశమైన కమిటీ సీతంపేట ఐటీడీఏ పరిధిలో తొమ్మిది రహదారుల నిర్మాణానికి అటవీ భూమిని వినియోగించుకునేలా అవకాశం కల్పించింది. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో కల్పనాకుమారి, డీఎఫ్‌వో ప్రసూన, పీఆర్‌ ఈఈ రాధారాణి సమావేశమయ్యారు. మొత్తం 21.5 కిలోమీటర్ల పొడవున రోడ్లకు పీఎంజీఎస్‌వై, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రూ.17.06 కోట్లు మంజూరు చేశారు. వీటితో భామిని మండలం మనిగ-అంటిజోల, నడిమిగూడ కాలనీ-గేదెలగూడ, కొత్తగూడ- నడిమిగూడ, దిమిడిజోల-కొత్తగూడెం, డోకులగూడ కాలనీ-శ్రీకాకుళం జిల్లా సరిహద్దు వరకు, సీతంపేట మండలం రేగులగూడ-పెద్దగూడ, పాతరంగంవలస-రంగంవలస, పెద్దగూడ- పాతరంగంవలస వరకు రోడ్లు వేయనున్నారు. ఇందుకు 8.55 హెక్టార్ల అటవీ భూమిని  వినియోగించనున్నారు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని