ఎండలు భగభగ!
ఉమ్మడి జిల్లాలో కొద్దిరోజులుగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా సగటున 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతున్నాయి.
జామిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
శనివారం 1.32 గంటలకు విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్మానుష్యం
ఈనాడు, విజయనగరం: ఉమ్మడి జిల్లాలో కొద్దిరోజులుగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా సగటున 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతున్నాయి. శనివారం వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. వృద్ధులు, చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జామి మండలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి ఎండ ఎక్కువగా ఉండడంతో గడప దాటి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఈ పరిస్థితి నాలుగైదు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పార్వతీపురం జిల్లా కురుపాంలో 43 డిగ్రీల సెల్సియస్.. పాలకొండలో 42.1, కొమరాడలో 42.1, సీతంపేటలో 41.5 డిగ్రీలు, వీరఘట్టంలో 40.7 పార్వతీపురంలో 40.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బీ విజయనగరం జిల్లా జామిలో 43.2 డిగ్రీల సెల్సియస్, మెంటాడలో 43, గజపతినగరంలో 42.8, వేపాడలో 42.5, రేగిడి ఆమదాలవలసలో 42.4, మెరకముడిదాంలో 42.2, ఎస్.కోటలో 42.1, గరివిడిలో 42.1, దత్తిరాజేరులో 41.6, కొత్తవలసలో 41.5, గంట్యాడలో 40.9, లక్కవరపుకోటలో 40.7 భోగాపురంలో 40.1 డిగ్రీలు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం