logo

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్రకు అన్యాయం

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత గద్దే బాబూరావు అన్నారు. చీపురుపల్లిలో శనివారం మాట్లాడుతూ..

Published : 28 May 2023 02:29 IST

గద్దే బాబూరావు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత గద్దే బాబూరావు అన్నారు. చీపురుపల్లిలో శనివారం మాట్లాడుతూ.. పోలవరం 45.72 మీటర్లు నిర్మిస్తే 194.60 టీఎంసీ నీటిని నిల్వ చేయొచ్చన్నారు. కానీ వైకాపా ప్రభుత్వం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించాలని ప్రయత్నిస్తోందని, దీనివల్ల 94.5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు నిర్మిస్తే సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో 8.5 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో 1,280 గ్రామాలకు తాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది మార్చిలోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ మంత్రి ప్రకటించారని, కానీ ఇంతవరకు పనులు పూర్తి కాలేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డిజైన్‌లో పేర్కొన్న ఎత్తు ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని